హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కి అగ్నిప్రమాదం : 19 మంది మృతి

లక్జర్‌ : ఈజిప్టులోని పురాతన నగరం లక్టర్‌పైగా ఎగురుతున్న హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఒకటి మంగళవారం అగ్ని ప్రమాదానికి గురి కాగా అందులో ఉన్న 19 మంది విదేశీ పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఈజిప్టు అల్లర్ల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ దేశ పర్యాటక పరిశ్రమకు ఈ ప్రమాదం శారాఘాతమవుతుందని  అధికారులు పేర్కొన్నారు. మొత్తం 21 మంది పర్యాటకులు బెలూన్‌లో ఉన్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలకు బెలూన్‌ పేలిపోయి  శకలాలు చెరుకు తోటలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఇద్దరు పర్యాటకులు మాత్రం ప్రాణాలతో బయటపడగా వారిని ఆస్పత్రిలో చేర్పించారు.