హార్దిక్‌ ఆమాత్రం కూడా తెలీదా?

రాజీనామా ప్రకటనపై రూపానీ మండిపాటు

న్యూఢిల్లీ,జూన్‌15(జ‌నం సాక్షి): గుజరాత్‌ సిఎం పదవికి తాను రాజీనామా చేసినట్టు పటీదార్‌ ఉద్యమనేత హార్ధిక్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలను విజయ్‌ రూపానీ తప్పుపట్టారు. విూడియా దృష్టిని ఆకట్టుకునేందుకే హార్ధిక్‌ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలియజేశారు. రాజీనామా అనేది కేబినెట్‌ సమావేశాల్లో చేయరని తెలిపారు. రాజ్‌ భవన్‌ కి వెళ్లి గవర్నర్‌ కి రాజీనామా లేఖ సమర్పిస్తారనే విషయం కూడా హార్ధిక్‌ కు తెలియలేదా అంటూ ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. కేబినెట్‌ సమావేశంలో, తమ పార్టీలో కానీ రాజీనామా అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు. హార్ధిక్‌ వ్యవహర శైలి కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్‌ ను తలపించేలా ఉందని విజయ్‌ రూపానీ ఎద్దేవా చేశారు. గుజరాత్‌ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.