Thursday, 5 November 2026

హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై చర్యలు తీసుకోవాలి

 

 

 

 

 

 

 

 

– పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు పుల్లూరి సింహాద్రి

 

మునగాల, మార్చి 11(జనంసాక్షి): పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు పుల్లూరి సింహాద్రి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ప్రారంభమైన నేపథ్యంలో కార్పోరేట్ కళాశాలల యజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని, దీని కారణంగా అనేక మంది విద్యార్థులు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని
ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఇలాంటి కళాశాల పైన ప్రభుత్వము చర్యలు తీసుకొని, ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కాలేజ్ ఫీజ్ తో సంబంధం లేకుండా హాల్ టికెట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేని మూలంగానే విద్యార్థులు ఇలాంటి నమస్యలను ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం మొత్తం బకాయిలను చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా కళాశాల యాజమాన్యాల కారణంగా పరీక్ష రాయకపోయినా మానసిక ఇబ్బందులకు గురైన ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఇంటర్మీడియట్ బోర్డ్ పైన ఉందని వారు అన్నారు. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందించక పోతే పి.డి.ఎస్.యు ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.