హుజూర్ నగర్ లో ఈనెల 27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ
– పట్టణంలో యూనియన్ మహాసభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం
హుజూర్ నగర్ నవంబర్ 24 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 27న టియుడబ్ల్యూజే,ఐజేయు యూనియన్ సూర్యాపేట జిల్లా మహాసభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు, దయాకర్ రెడ్డి, టివీఎల్ తెలిపారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలో యూనియన్ మహాసభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా యూనియన్ మహాసభకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్ కుమార్, జడ్పీ చైర్మన్ దీపిక యుగంధర్ తో పాటుగా యూనియన్ జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ ఏపీ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్, రాష్ట్ర అధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహాత్ ఆలీ, జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొంజేటి సత్యనారాయణ, జిల్లా నాయకత్వం అందరూ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు N. నరేందర్, బసవోజు శ్రీనివాస చారి, పిల్లలమర్రి శ్రీనివాస్, కిత రామనాథం, షేక్. జానీ పాషా, కోమరాజు అంజయ్య, పెందుర్తి భాస్కర్, దేవరం రాంరెడ్డి, ఆర్ పి గౌడ్, దేనుముకొండ శేషంరాజు, దేవరం వెంకటరెడ్డి, ఇట్టి మల్ల రామకృష్ణ పాల్గొన్నారు.
హుజూర్ నగర్ లో ఈనెల 27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ




