హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు – మంత్రివర్యులు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి -గిరిజన నాయకులు
హుజూర్ నగర్ జనవరి 01 (జనంసాక్షి): హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేసిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి హుజూర్ నగర్ విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయుటకు గిరిజన ముఖ్య నాయకుల సమావేశం హుజూర్ నగర్ లో జరిగిందన్నారు. ఆదివారం ఈ సందర్భంగా గిరిజన ముఖ్య నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆహ్వానాన్ని మన్నించి ఈ నెల 06 వ తారీకున తెలంగాణ రాష్ట్ర ఐటీ, పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటనను యావత్ గిరిజనులు, బీరాస కుటుంబ సభ్యులు పర్యటన లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి సమైక్యాంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అభివృద్ధిని తెలంగాణ సిద్ధించాక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని, కేటీఆర్ యువనాయకత్వాన్ని, హుజూర్ నగర్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నటువంటి హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కి మద్దతూ తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి జడ్పిటిసి జగన్ నాయక్, మాజీ ఎంపీపీ కొండా నాయక్, తెరాస నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అడ్వకేట్ నగేష్ రాథోడ్, బాణావతి వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీటీసీ అశోక్ నాయక్, లీలాధర్ మణికంఠ నాయక్, భూక్యా నాగు నాయక్, డాక్టర్ జిలేంద్రుడు, సర్పంచులు రామారావు నాయక్, బాబు నాయక్, బానవత్ మీసాల సైదా నాయక్ , గుగులోతు సందీప్ నాయక్, నారాయణ నాయక్, చిరంజీవి నాయక్, ఖిమ్యా నాయక్, వశ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు – మంత్రివర్యులు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి -గిరిజన నాయకులు




