హైదరాబాద్, సెప్టెంబర్ 12 : నగరంలోని హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏడాది బాలుడు అదృశ్యమయ్యాడు. క్యాంటిన్ ముందు ఆడుకుంటుండగా బాలుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




