హుస్నాబాద్ లో పాఠశాలల బంద్ విజయవంతం
హుస్నాబాద్ ఆగస్టు 23(జనంసాక్షి) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జూనియర్ కళాశాలల విద్యలో కార్పొరేట్ శక్తుల ఆఘాడాలను,ప్రభుత్వ జూనియర్ కళాశాలల పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ జూనియర్ కళాశాలల బందును నిర్వహించడం జరిగిందని ఎబివిపి హుస్నాబాద్ నగర కార్యదర్శి ఆదిత్య తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ ఆన్లైన్ లో చేపట్టాలని,కార్పొరేట్ శక్తుల ఆఘాడాలను అరికట్టి, అధిక ఫీజులు నియంత్రించేలా ప్రభుత్వం,ఇంటర్ బోర్డ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకుమార్, నగర సంయుక్త కార్యదర్శి రాకేష్, సోషల్ మీడియా కన్వీనర్ వేణు, జోనల్ ఇంచార్జ్ అరుణ్ కుమార్, ప్రభుత్వ కళాశాల కార్యదర్శి రాజేష్, సందీప్, అన్వేష్, రాజు, రమేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.