Wednesday, 4 November 2026

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబద్: హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ఆటంకాలు తొలగిపోయాయి. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోల్‌ అనే సంస్థ హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన అశాస్త్రీయంగా చేస్తున్నారంటూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రక్షాళన పనులు నిలిపివేయాలని ట్రిబ్యునల్‌ ఆదేశాలిచ్చింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ప్రక్షాళన అశాస్త్రీయమంటూ.. నిలిపివేయాలని గతంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు హైకోర్టు అనుమతిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *