Wednesday, 4 November 2026

హెడ్ కానిస్టేబుల్ సదయ్యకు సన్మానం

 

కొత్తగూడ జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో స్థానిక పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ సదయ్య తన విధి నిర్వహణలో భాగంగా కేసముద్రం మండల పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్తున్న సందర్భంలో స్థానిక ఎస్ఐ నగేష్ శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్ఐ శోభ రాణి,పోలీస్ సిబ్బంది వెంకటయ్య,భోజ్య నాయక్,గణపతి,భరత్,జంపయ్య,కేదరి తదితరులు పాల్గొన్నారు.