హైదరాబాద్: దేశ చరిత్రలో మొదటిసారిగా చారిత్రక కట్టడాల మధ్య రన్ నిర్వహించడం అభినందనీయమని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చారింత్రక నేపథ్య కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన సూచించారు. హైదరాబాద్ హెరిటేజ్ మారధాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలస్ వద్ద ప్రారంభమైన రన్ కుతుబ్‌షాహి సమాధుల వరకు సాగింది. వెయ్యి మందికి పైగా జౌత్సాహికులు ఈ రన్‌లో పాల్గొన్నారు. కుతుబ్ షాహి సమాధుల మధ్య జరిగిన ముగింపు కార్యక్రమంలో స్పీకరు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ విభాగాల్లో ఇదియోపియా, కెన్వా దేశాలకు చెందిన ఔత్సాహికులు ఎక్కువగా నగదు బహుమతులు, మెడల్స్ గెలుపొందారు. ఇలాంటి కార్యక్రమాలతో దేశంలోనే కాకుండా ప్రపంచపటంలో హైదరాబాద్ పేరు నిలిచిపోతుందని స్పీకర్ అన్నారు.




