Wednesday, 4 November 2026

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

– జీఓ నెం.7పై స్టే విధించిన కోర్టు
– ఏడాదిపాటు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో స్పోర్ట్స్‌ కోటాను పరిగణలోకి తీసుకోవద్దని ఆదేశం
హైదరాబాద్‌, జులై6(హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు): తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గత నెల 21న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.7పై కోర్టు స్టే విధించింది. ఏడాది పాటు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో స్పోర్ట్స్‌ కోటాను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.7 వల్ల స్పోర్ట్స్‌ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని స్పోర్ట్స్‌ అభ్యర్థులు నిలేరాయ్‌, కాలేశ్రేయ పిటిషన్‌ దాఖలు వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రొఫెషనల్‌ కోర్సులో స్పోర్ట్స్‌ కోటాను ఎత్తేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.7లో కూడా అనేక అక్రమాలు జరిగాయని కోర్టుకు తెలిపారు. దీంతో ప్రొఫెషనల్‌ కోర్సులో స్పోర్ట్స్‌ కోటాను ఎత్తేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. జీవో నెం.7ను రద్దు చేస్తూ జస్టిస్‌ రామసుబ్రమణ్యం బెంచ్‌ తీర్పు ఇచ్చింది.