Tuesday, 3 November 2026

హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు రేపటి నుంచి

హైదరాబాద్‌ సిటీ: హైకోర్టు పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27 నుంచి నవంబర్‌ 25వ తేదీ వరకూ అమలులో ఉంటాయన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు మినహా ఆయా ప్రాంతాల్లో మిగిలిన వారందిరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. సిటీకాలేజీ-నయాపూల్‌రోడ్‌, మదీనాకాలేజీ రోడ్‌-సిటీకాలేజీరోడ్‌, నయాపూల్‌ – మదినారోడ్‌ – హైకోర్టురోడ్‌, ముస్లింజంగ్‌ బ్రిడ్జ్‌ సర్కిల్‌-హైకోర్టు రోడ్‌, పురానాపూల్‌-పీటీఓ-సిటీకాలేజీ క్రాస్‌రోడ్‌, మూసాబౌలి-మెహందీ-సిటీ కాలేజీ క్రాస్‌రోడ్‌-కోర్టు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ఈ ప్రాంతాల్లో సమావేశాలు, మారణాయుధాలతో సంచరించటం, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను నిషేధించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *