హైదరాబాద్ సిటీ: గణేశ్ నిమజ్జనం సందర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జంటనగరాల్లో ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్స్, బార్స్ అండ్ రెస్టారెంట్లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ ఉత్తర్వులు వర్తించవని తెలిపారు.




