Tuesday, 3 November 2026

హైటెక్ సిటీ లో జరిగె ఎక్సపోకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు పాల్గొనాలి :రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడైన మిద్దెల జితేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేబులు ఆపరేటర్ల విషయాలపై మాట్లాడుతూ ఈనెల ఆగస్టు 26, 27, 28 తేదీలలో సీఎన్ సి   గ్రూప్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ లో జరగబోయే 10వ ఎక్సపోకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లు అందరు తప్పక హాజరై నూతన టెక్నాలజీని అమలు చేయడానికి అదేవిధంగా నూతన టెక్నాలజీని నేర్చుకొనుటకు అందరూ తప్పక హాజరు కావలసిందిగా కోరడమైనది గడిచిన 30 సంవత్సరాలలో అతి తక్కువ ధరకు ప్రజలకు వినోదం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు రాబోయే కాలంలో నూతన టెక్నాలజీతో మరింత చౌకగా వినోదాన్ని అందించగలమని ఆయన తెలియజేశారు ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ 1500 వందలకు ఇంటర్నెట్ కేబుల్ టీవీ వాయిస్ ఓవర్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అదే సౌకర్యాన్ని  కేబుల్ ఆపరేటర్లు 600 వందల రూపాయలకు ఇవ్వగలమని ప్రజలంతా గమనించగలరని ఆయన కోరారు ఆపరేటర్ ఎవరు అధైర్యపడొద్దు అని.  టీవీ ఉన్నంతకాలం కేబుల్ ఆపరేటర్ల మనుగడ ఉంటుందని కేబుల్ ఆపరేటర్ అనేవాడు ఈ వ్యవస్థను సృష్టించి నటువంటి సృష్టికర్త అని ప్రతి ఆపరేటర్  గమనించాలని ఆయన తెలియజేశారు కేబుల్ ఆపరేటర్లు గడిచిన 30 సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత పెట్టుబడి తో లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని ఆయన ఆరోపించారు  ఎమ్మార్పీ ,జీఎస్టీ    పోల్ టాక్స్ ఆని కేబుల్ ఆపరేటర్ల నీ ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అతి తక్కువ ధరకు పేదవారికి వినోదం అందిస్తున్న కేబుల్ ఆపరేటర్లునూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఒక పరిశ్రమగా గుర్తించాలని కేబుల్ ఆపరేటర్లకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించి నూతన టెక్నాలజీ తో కొట్టుమిట్టాడుతున్న కేబుల్ ఆపరేటర్లకు సబ్సిడీపై పరికరాలని సప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేశారు అదేవిధంగా ఛానల్స్ ఎమ్మార్పీ ,జీఎస్టీ , పోల్ ట్యాక్స్   రద్దు చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేయడమైనది .
ఆపరేటర్స్ ఎవరు కూడా అధైర్యపడకుండా నూతన టెక్నాలజీ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆయన పేర్కొన్నారు