Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం

కంచన్‌బాగ్‌: హైదరాబాద్‌ నగరంలో తాళం వేసిన ఇళ్లల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ల్యాబ్‌ క్వార్టర్స్‌కు చెందిన డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్త అమిత్‌పటేల్‌ ఇంట్లో రూ.1.20 లక్షల నగదుతోపాటు పలు బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులను దొంగిలించారు. ఆ కార్డులను ఉపియోగించి రూ. 80 వేలు డ్రాచేశారు. మరో ఘటనలో మారుతినగర్‌లోని తిరుమల హోమ్స్‌లో నివాసం ఉంటున్న జీవన్‌ ప్రభాకర్‌ ఇంట్లో 15 తులాల బంగారం, వెండిని ఎత్తుకెళ్లారు. యాదగిరి కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత రక్షణ శాఖ ఉద్యోగి బి. మదన్‌మోహన్‌రావు ఇంట్లో దొంగతనానికి యత్నించగా అక్కడ ఎలాంటి అభరణాలు కనిపించపోవడంతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై జహంగీర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *