Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో భారీ వర్షం

26brk57aహైదరాబాద్‌: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, నాచారం, సికింద్రాబాద్‌, శంషాబాద్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల్లో ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకూ కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారిపై మోకాలిలోతు నీరు నిలిచింది. భారీ వర్షానికి ట్రాఫిక్‌ స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *