Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్… 24 గంటల్లో నిందితుల అరెస్టు

 
హైదరాబాద్‌లో మరో యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి జరిగింది. హోటల్‌లో పనిచేస్తున్న కార్మికురాలు ఒంటరిగా వస్తుండగా మాటు వేసి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై స్పందించిన హైదరాబాద్ నగర పోలీసులు… తక్షణం రంగంలకి దిగి 24 గంటల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రాజీవ్‌గాంధీ నగర్ సాగర్‌హిల్స్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (22) సమీపంలోని హోటల్‌లో కార్మికురాలుగా పనిచేస్తోంది. బుధవారం అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రాజీవ్‌గాంధీ నగర్ కాలనీకి చెందిన కార్మికులు రమావత్ నగేశ్ (20), ఓ టెంట్‌హౌజ్ కార్మికుడు రమావత్ కుషా (20), రమావత్ ప్రభాకర్ (23) ఆ యువతిని అటకాయించి సామూహికంగా లైగింకదాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *