భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ మార్కెట్ కమిటీ సమావేశంతో పాటు.. పలు అంశాలు ఇంటర్నేషనల్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 257 పాయింట్ల నష్టంతో 26వేల 763 దగ్గర క్లోజయింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 69 పాయింట్ల లాస్ తో 8వేల 203 దగ్గర ముగిసింది.




