నగరంలో అడుగుపెట్టిన ముంబై కిడ్నాప్ గ్యాంగ్ ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. హైదరాబాద్ నారాయణగూడలో ఖలీం అనే వ్యాపారిని ముంబైకి చెందిన ఓ కిడ్నాప్ ముఠా కిడ్నాప్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అన్ని పోలీస్ స్టేషన్లకు చేరవేసి అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో మొయినాబాద్‌లో పోలీసులకు కిడ్నాపర్లు పట్టుబడ్డారు. వారి చెరనుంచి వ్యాపారిని విడిపించారు.




