హైదరాబాద్,నవంబర్9(జనం సాక్షి): చలో ట్యాంక్‌బండ్ నేపథ్యంలో170 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌పై ప్రశాంత వాతావరణం ఉందని సీపీ తెలిపారు. ఇదిలా ఉంటే.. అయోధ్యపై సుప్రీంకోర్టు నేపథ్యంలోనూ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అంజనీకుమార్ తెలిపారు. అంతేకాకుండా సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. కాగా.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు పిలుపునిచ్చిన ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.




