హైదరాబాద్ ఆగస్టు30 : జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలుపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే లోక్ సభ స్థానాల వారీగా గురువారం సవిూక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదట మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల అమలును బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సవిూక్షిస్తారు. బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ని కలిసిన ఎంపీ మల్లారెడ్డి, పార్లమెంటు సభ్యులతో, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి
కార్యక్రమాల అమలు, చేపట్టాల్సిన నూతన పనులు విషయంలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కోరారు. ఇందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించి సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఈ సవిూక్ష సమావేశానికి నగర పరిధిలోని రాజ్యసభ సభ్యులతో పాటు స్థానిక లోకసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు సంబంధిత అధికారులు పాల్గొంటారు. ఇదే విధంగా త్వరలోనే సికింద్రాబాద్, చేవేళ్ల, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సవిూక్ష సమావేశాలను మంత్రి నిర్వహించనున్నారు.




