Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ కుక్కల స్వైరవిహారం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 : నగరంలో కుక్కలు స్వైర్‌ వివాహరం చేస్తున్నాయి. ఎల్‌బీనగర్‌లో వీధికుక్కల దాడిలో 8 మంది గాయపడ్డారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం సోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి రోదన పలువురిని కంటతడి పెట్టించింది. ఎల్‌బీనగర్‌లో వీధికుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ వచ్చే పోయే వారిపై దాడికి దిగుతున్నాయి. తాజాగా ఆడుకుంటున్న కొందరు చిన్నారులపై దాడి చేశాయి. పిల్లలు పరుగులు పెట్టినా వెంబడించి మరీ కరిచాయి. వీధికుక్కల దాడల గురించి అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *