Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

నిజామాబాద్‌: హైదరాబాద్‌ కొంపల్లిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సుకు హాజరయ్యేందుకు నిజామాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎ అలీం మాట్లాడుతూ….. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. అవినీతి, అసమర్థ కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు అగ్రహంతో ఉన్నారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. సదస్సులో పాల్గొనేందుకు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి సుమారు 200 మంది బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *