Wednesday, 4 November 2026

హైదరాబాద్ చేరుకున్న బంగారు లక్ష్మణ్‌

హైదరాబాద్‌: ఢిల్లీ  హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీజేపీ సీనియర్‌ నేత బంగారు లక్ష్మణ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆపార్టీ నేతలు బండారు దత్తత్రేయ, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, బద్దం బాల్‌రెడ్డిలతో పాటు ,బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలివచ్చి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో లక్ష్మణ్‌కు స్వాగతం పలికారు. ఒక కుట్ర పూరితంగా తనను అక్రమంగా కేసులో ఇరికించినప్పటికి న్యాయపోరాటంలో విజయం సాధిస్తానని లక్ష్మణ్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *