హైదరాబాద్: తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సింది మంత్రులు కాదని, ఎంపీలేనని మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎంపీలు మంత్రులు రాజీనామాలు చేయమని డిమాండ్ వ్యక్తం చేసే బదులు వారే రాజీనామాలు చేస్తే…కేంద్రంపై ఒత్తిడి పెరిగుతుందని అభిప్రాయపడ్డారు. తాము గతంలో రాజీనామాలు చేసి విధులకు దూరంగా ఉంటే తెలంగాణ ప్రాంతంలో అభివృద్థి కుంటుపడిన విషయాన్ని గుర్తించాలన్నారు.




