హైదరాబాద్: ఎస్నగర్లో కల్తీ నెయ్యి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 1000 లీటర్ల కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో అక్రమార్కులు చెలగాటం ఆడుతున్నారు. ఈ ముఠా సభ్యులు అడ్డదారిలో డబ్బు సంపాదించడమే మార్గం ఎంచుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
Related