ఖైరతాబాద్ : జూలై 19 (జనం సాక్షి) యూకేకు చెందిన డేటా అండ్ అనలిటిక్స్, ఈఆర్పీ స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ కగూల్ గచ్చిబౌలిలోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న కపిల్ టవర్స్ భవనంలో అదనపు కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసింది. తద్వారా హైదరాబాద్ లో తన కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించింది. కగూల్ సీఈఓ డాన్ బార్లో 200 మందికి పైగా ఉద్యోగులకు వసతి కల్పించే కొత్త 17,000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాన్ బార్లో మాట్లాడుతూ కగూల్ సంస్థ ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీలో రాణిస్తుందన్నారు. ఎనలిటిక్స్, ఏఐ/ఎంఎల్, ఇంటిగ్రేషన్లు, ఎస్ఏఎస్ యాప్ లు, ఈఆర్పీ, వెబ్ అప్లికేషన్లు, టెస్టింగ్, ఏఎంఎస్ లాంటి రంగాల్లో ఉత్పత్తులు, సేవలను అందిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమన్న మా విధానాలకు అనుగుణంగా భారతదేశంలోని తమ బృందానికి సాధ్యమైనంత మంచి పని వాతావరణాన్ని అందించాలని మేము కోరుకుంటున్నామని కగూల్ గ్రూప్ సీఓఓ, సీఐఓ ప్రశాంత్ పటేల్ అన్నారు. గత త్రైమాసికంలో ఎన్ఐటీలు, బిట్స్, గీతమ్స్, జీఎస్ఐఎస్, కిట్స్(వరంగల్) తదితర ప్రముఖ సంస్థల నుంచి పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు కగూల్ ఏపీఏసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి తెలిపారు.
హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరించినట్లు ప్రకటించిన కాగుల్




