హోరాహోరీగా సాగిన అంతర్ రాష్ట్ర గోల్డ్ క్రికెట్ టోర్నీ
జహీరాబాద్ జనవరి 2 (జనం సాక్షి ) గత రెండు రోజులగా సాగుతున్న కిజర్ యపై అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి, సోమవారం రెండవ రోజు శేకపూర్ సీసీ హైదరాబాద్ జట్టు మధ్య ఉత్కంఠ బారితంగా సాగిన క్రికెట్ పోటీలను నిర్వాహకులు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కిజర్ యపై ప్రేక్షకుల మధ్య తిలకించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై మాట్లాడుతూ క్రీడలతో వ్యక్తుల మధ్య స్నేహాభావం పెంపొందుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని హుందాగా స్వీకరించిన వారే నిజమైన విజేతలని అన్నారు. కార్యక్రమంలో బిలాల్ పూర్ సర్పంచ్ నర్సిములు మహేబూబ్ ఖాన్, బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు లతిఫ్ బి అజిమోద్దీన్, ఇస్మాయిల్, సద్దాం, అబ్దుల్లా సిద్దిఖీ, శ్రీనివాస్ యాదవ్, నర్సింలు యాదవ్,, జైపాల్, ప్రవీణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా సాగిన అంతర్ రాష్ట్ర గోల్డ్ క్రికెట్ టోర్నీ




