Tuesday, 3 November 2026

12 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభూతులు

సమంత ఎమోషనల్‌ పోస్ట్‌
12 ఏళ్ల ప్రయాణలంలో ఎన్నో అనుభూతులు..మరెన్నో అనుభవాలు అంటూ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఎమోషనల్‌ అవుతూ సోషల్‌ విూడియాలో తాజాగా పోస్ట్‌ పెట్టారు. మూడు మార్చలేని పదాలతో ఇక్కడ వరకు చేరుకున్నాను.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో సమంత ఒకరు. ’ఏ మాయ చేశావే’ అంటూ తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. కెరీర్‌ ప్రారంభం నుంచే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ఎన్‌.టి.ఆర్‌, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ లాంటి అగ్ర హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా మారారు. గత ఏడాది ’ది ఫ్యామిలీ మాన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. సమంత తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టి ఈ రోజుతో 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దాంతో తన సోషల్‌ విూడియా ఖాతాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను పెట్టారు. దీనిలో ..’ఈరోజుతో నా సినీ ప్రయాణం 12 ఏళ్ళకు చేరుకుంది. లైట్స్‌, కెమెరా, యాక్షన్‌ అనే మూడు మార్చలేని పదాలతో
ఇక్కడి వరకు చేరుకున్నాను.. ఈ ప్రయాణంలో అందరికీ ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నానని.. ముఖ్యంగా నాకు విధేయతతో కలిగి ఉన్న ఫ్యాన్స్‌కు ఎంతో ఋణపడి ఉన్నాననీ’ సమంత పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్‌ అవుతోంది. కాగా, సమంత త్వరలో ’శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలై ఆకట్టుకుంది.