ఎల్బీ నగర్( జనం సాక్షి ) భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ పి జె అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా వనస్థలిపురం రెడ్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు మరియు బి ఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ పాల్గొని డా.అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించిన మహనీయులు అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో యువతరం పయనించి దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.మహనీయుల త్యాగాలు చిరస్థాయిగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి సంజయ్ కుమార్, పెండ్యాల యాదగిరి, మిట్టా రామ్మోహన్,దామోదర్ గౌడ్, షేక్ మహ్మద్,శేఖర్ , ప్రశాంత్ గౌడ్ ,స్వప్న ,శ్యామ్ , మారం సత్యనారాయణ , శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ తదితతరులున్నారు .




