బూర్గంపహాడ్ మే 0 2 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరు కాలనీ శివారు పవిత్రమైన గోదావరి నది తీరమున డాక్టర్ వి వి మల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా గురువారం జరిగే శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులనని విలేకరుల సమావేశంలో మంగళవారం నిర్వాహకులు వెల్లడించారు. కళ్యాణం రోజు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం, అనంతరం సాంప్రదాయబద్ధంగా టిటిడి రిత్వికుల ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. టీటీడీ నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మూడవ తేదీ సాయంత్రం లోపు కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటాయని వారు తెలిపారు. ఈ ఉత్సవ విగ్రహాలకు మొరంపల్లి బంజర నుంచి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలియజేశారు. కళ్యాణ వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, అనంతరం పదివేల భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుల కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సంకల్ప దాత డాక్టర్ వివి మల్లేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు నిర్వాహకులు పాల్గొన్నారు.




