Thursday, 5 November 2026

10కె, 5కె రన్‌ల పోస్టర్లు ఆవిష్కరణ

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ):  చార్మినార్‌లో 13న ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే 5కే, 10కే రన్‌లకు సంబంధించిన పోస్టర్లు, పాల్గొనేవారికి ఇచ్చే టీ-షర్ట్‌లను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌ డా.బి. జనార్దన్‌రెడ్డి, అదనపు కమిషనర్లు కూడా మేయర్‌తోపాటు పాల్గొన్నారు. కాగా, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టుకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో 13న, ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు చార్మినార్‌ నుంచి 10కే, 5కే రన్‌లు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పాల్గొనాలనుకునేవారు లిలిలి.|ల|నిబిబనినీలి.ఞనీప అనే వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 10కే రన్‌ చార్మినార్‌ నుంచి చాంద్రాయణగుట్ట ఇన్నర్‌ రింగురోడ్డు విూదుగా మళ్లీ చార్మినార్‌కు చేరుతుందని, అలాగే 5కే రన్‌ చార్మినార్‌ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకు, అక్కడినుంచి తిరిగి మళ్లీ చార్మినార్‌కు చేరుతుంది. ముందస్తుగా పేర్లు నమోదుచేసుకుంటే టీషర్ట్‌, స్నాక్స్‌ అందజేస్తారు.