హైదరాబాద్: ఆటోడ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస ఈనెల 10న అర్థరాత్రి నుంచి ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నగరంలో 20 వేల కొత్త ఆటోలకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 90ని వెంటనే రద్దుచేయాలని ఐకాస నేతలు డిమాండ్ వ్యక్తం చేశారు. నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను పరిష్కరించకుండా కొత్త ఆటోలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. పోలీసు ఇ-చలాన్లవిధానాన్ని రద్దుచేయాలని, అక్రమంగా ఓవర్‌లోడ్‌తో నడుస్తున్న ఆటోలపై నిషేథం విధించాలని తదితర డిమాండ్లపై ఈసమ్మెకు పిలుపునిస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస కన్వీనర్ మహ్మద్ అహ్మదుల్లాఖాన్ తెలియజేశారు.




