Tuesday, 3 November 2026

10న రిథమ్‌ ఆఫ్‌ విమెన్‌ కచేరి

హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు మోడ్రన్‌ సంగీతంలోనూ తమదైన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. విమెన్‌ ఆఫ్‌ రిథమ్‌ పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10న మాదాపూర్‌లోని సీసీఆర్‌టీ హంపి థియేటర్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో 20 మంది మహిళా ఫెర్యూసన్‌ కళాకారులు కచేరీ నిర్వహించ బోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్‌ ఎంపీ కవిత బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 14లోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. పురుషులకు మా త్రమే పరిమితమైన ఫెర్యూసన్‌ పరిశ్రమలో మహిళలు కూడా రాణిస్తుండడం అనందంగా ఉందని కవిత పేర్కొన్నా రు. ఈ కచేరీలో అనన్యపాటిల్‌, సుకన్యా రామ్‌గోపాల్‌, సమ్మ తి రాంమోహన్‌రావు, మిథాలీ ఖర్గో వంకర్‌, దేబోప్రియ రణ్‌దీప్‌, చందనా బాల తమ సంగీతంతో నగర ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని నిర్వాహకులు తెలిపారు.