10వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 27(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో 14లక్షల నిధులు ఖర్చుతో సిసి రోడ్డు పనులను నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎంఎల్ఏ మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు 10వ వార్డులో సిసి రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో సి సి రోడ్డు పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు.ఎంఎల్ఏ సాహకారంతో మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాబు రావు, కౌన్సిలర్లు బాదం సునిత,పార్టీ కార్యకర్తలు బాదం రమేష్, బాదం నరేందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.