10శాతం రిజర్వేషను పోరాడి సాధించుకున్నాం-లంబాడా హక్కుల పోరాట సమితి
నెరడిగొండ అక్టోబర్2(జనంసాక్షి):
గిరిజనుల జనాభా దామాషా ప్రకారం10 శాతం రిజర్వేషన్ను పోరాడి సాధించుకున్నామని లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాణావత్ గోవింద్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ నాయక్ అన్నారు.ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో లంబాడి సంగం ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పులమాల వేసి ఈ సందర్భంగా బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ10 రిజర్వేషన్ అమలు కోసం లంబాడీల ఉద్యమ నాయకుడు డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ నేతృత్యంలో గిరిజనులను ఐక్యం చేసి అనేక పోరాటాలు నిర్వహించి రిజర్వేషన్ సాదించికునట్లు తమ పోరాటాలను గౌరవించి 10 శాతం రిజర్వేషన్ అమలుకు జీవో విడుదల చేసిన కేసీఆర్ కు కృతజ్ఞతాలు తెలుపుతూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్రా నాయకులూ డాక్టర్ బాపూరావు పవర్ లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా ప్రచార కార్యదర్శి రాథోడ్ రోహిదాస్ నాయక్ వినోద్ నాయక్ రాథోడ్ సాయి కుమార్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.