హైదరాబాద్,(జనంసాక్షి): డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె బాట పట్టిన 108 ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 108 సిబ్బంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు ర్యాలీలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న అలోచన తమకు లేదని 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.




