హైదరాబాద్,(జనంసాక్షి): వైద్య అత్యవసర సేవలు అందించే 108 సర్వీసులు ఈ రోజు నుంచి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ 108 ఉద్యోగులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 108 ఉద్యోగ సంఘాల నేతలతో జీవీకే యాజమాన్యం జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.




