జిల్లాల ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి 11మంది మినహయింపు
హైదరాబాద్: జిల్లాల ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి 11 మంది సీనియర్ మంత్రులను తప్పించారు. తమను ఆ బాధ్యతలనుంచి తప్పించాలని వారు చేసిన విజ్ఞప్తిమేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, బొత్స, ఆనం, రఘువీర, సుదర్శన్‌రెడ్డి, డొక్కా, శత్రుచర్ల, వట్టి, గల్లా, దానంలను ఇన్‌ఛార్జి బాధ్యతలనుంచి మినహాయించారు. దీనిపై ఈ రోజే ఉత్తర్వులను కూడా జారీచేయనున్నారు.