Wednesday, 4 November 2026

11 నుంచి మధ్యాహ్న బోజన కార్మికుల రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్‌: మధ్యాహ్న భోజన కార్మికుల రెండో మహాసభలు అనంతపురంలో జరుగనున్నట్లు కార్మిక సంఘ నేతలు హైదరాబాద్‌లో తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో జరిగే సభల్లో రెండేళ్ల పోరాటాన్ని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తమిళనాడులో మాదిరి రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా రూపొందించిన గోడపత్రికను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *