హైదరాబాద్,మే4(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల స్వయం ఉపాధి యోగ్యత, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం (బీసీ స్టడీ సర్కిల్) నూతన డైరెక్టర్‌గా జి. సుజాత నియమితులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాలశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నియమించింది. ప్రభుత్వ జర్నల్స్‌తోపాటు ప్రముఖ తెలుగు పత్రికల్లో కూడా వివిధ ¬దాల్లో సుజాత బాధ్యతలు నిర్వహించారు. చదువుకొనే రోజుల్లో ఆమె ఐదు గోల్డ్ మెడల్స్ సాధించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న సుజాతకు సమస్యలపై అవగామన ఉంది. ఆమె సేవలను ఇక్కడ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.




