Wednesday, 4 November 2026

12న సీజ్‌ చేసిన వాహనాల వేలం

హైదరాబాద్‌,మే8(జ‌నం సాక్షి): పన్ను చెల్లించని, కేసులు నమోదుతో సీజ్‌ చేసిన వాహనాలను వేలం వేస్తున్నామని నాగోల్‌ ఆర్‌టీవో పాపారావు ఒక ప్రకటనలో తెలిపారు. నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో దీర్ఘకాలంగా పడిఉన్న వాహనాలను ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద ప్రభుత్వానికి రావాల్సిన పన్ను వసూలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈనెల  12న ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభిస్తారని తెలిపారు. ఒక్కో వాహనానికి నాన్‌ రిఫండబుల్‌ కింద రూ.300 లేదా రిఫండబుల్‌ రూ.2,000ను బిడ్డర్లు ముందుగా చెల్లించవలిసి ఉంటుందని తెలిపారు. వాహనాల జాబితా కోసం ఆర్టీఎ సంప్రదించాలని సూచించారు.