13న మిడ్‌లెవెల్‌ ప్రొవైడర్ల నియామకానికి రాత పరీక్ష

గుంటూరు,మే12(జ‌నం సాక్షి): హెల్త్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో 325 మిడ్‌ లెవెల్‌ ప్రొవైడర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థులందరికీ ఈనెల 13న ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జోన్‌ 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వారికి గుంటూరు జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,195 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 100 ప్రశ్నలతో 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థుల సౌకర్యార్థం గుంటూరులో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. సందేహాలు ఉన్నవారు 98481 58088, 94409 13925 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. పరీక్షా కేంద్రంలోకి మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తారు. తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. మళ్లీ 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

తాజావార్తలు