ఇంటర్‌నెట్‌డెస్క్ , హైదరాబాద్ : ఈజిప్టులో మహ్మద్ మోర్సీ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా జరిపిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు ఆ దేశ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. మోర్సీని అధ్యక్ష పదవినుంచి తొలగించడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. మోర్సీని గత ఏడాది అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో అప్పటి నుంచి ఆయన మద్దతుదారలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.




