Tuesday, 3 November 2026

14న ఓయూ విద్యార్థులతో రాహుల్‌ ముఖాముఖి

ఏర్పాట్లు చేస్తున్న పిసిసి

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీ ఉస్మానియా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గతంలో సెంట్రల్‌ వర్సిటీలో కూడా ఇలాగే ముఖాముఖి చేపట్టారు.ఈ నెల 13, 14 తేదీల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ¬దాలో తొలిసారి ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే బస్సుయాత్రల్లో రాహుల్‌ పాల్గొంటారని ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అలాగే ఈ నెల 14న ఓయూ విద్యార్థులతో రాహుల్‌ భేటీకానున్నారు. ఇందుకోసం ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ముందు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ కార్యక్రమం సక్సెస్‌ కోసం ఓయూ విద్యార్థులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై చర్చిస్తున్నారు.