ఎన్జీవో నేతపై కెఇకి మహిళా ఉద్యోగి ఫిర్యాదు

విజయవాడ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఎన్జీవో నేత కృపావరం అనే అతను తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ గొల్లపూడి దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి జ్యోతి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన విధులు తాను నిర్వహించకుండా అతను అడ్డుతగులుతున్నారని, సరిగా పని చేయడంలేదని తనను పదే పదే వేధిస్తున్నారని ఆమె కేఈకి పిర్యాదు చేశారు. దీంతో కేఈ ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటానని, అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కేఈ కృష్ణమూర్తి ఆమెకు హావిూ ఇచ్చారు.

తాజావార్తలు