Wednesday, 4 November 2026

14న సింగరేణిలో సెలవు ప్రకటించాలి

ఆదిలాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): అంబేడ్కర్‌ జయంతి రోజున సింగరేణి కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సెలవు ఉన్నప్పటికీ తమకు మాత్రం లేదన్నారు.  అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని మార్చి 14న సింగరేణిలో వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని కోరుతున్నారు. దీనిని సాధించుకునేందుకు  మంగళవారం శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం వద్ద ఒక్కరోజు దీక్షను నిర్వహిస్తున్నట్లు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తాము సెలవు కోసం డిమాండ్‌ చేస్తున్పటికీ సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. ఇదిలావుంటే దినసరి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం వస్తుందని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు   హెచ్చరించారు.  ఐటీడీఏ ముందు దినసరి ఉద్యోగులు  దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.  ఒక్కరోజు వేతనం ఆలస్యం వచ్చినా పెద్దపెద్ద అధికారులే సహించలేని పరిస్థితులున్న ఈ రోజుల్లో తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం ఏమాత్రం సరైంది కాదన్నారు. ఇంతకన్న దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నించారు. వెంటనే బాకాయి వేతనాలను చెల్లించాలని, దినసరి ఉద్యోగులందరికీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దినసరి ఉద్యోగుల పక్షాన తెలంగాణ ఎస్సీఎస్టీఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *