Wednesday, 4 November 2026

150 అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్‌ చేశాం: నాయిని

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అశ్లీల వెబ్‌సైట్లను గుర్తించి బ్లాక్‌ చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పటికే 150 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్టు సభకు తెలిపారు. సైబర్‌ నేరాలను అరికట్టడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *