హైదరాబాద్: కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో తెలిపారు. కేజీ టు పీజీ విద్యపై ప్రభుత్వం మేధావుల అభిప్రాయాలను స్వీకరిస్తోందన్నారు. అసెంబ్లీ ఆమోదంతో త్వరలో అమలు చేస్తామని మంత్రి తెలిపారు. పేదల నుంచి ధనికుల వరకు అందరికీ కామన్ స్కూల్ విధానం అమలు చేస్తామని చెప్పారు. స్కూళ్లలో విద్యా ప్రమాణలు ఒకే రకంగా లేవని, గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా, పట్టణాల్లో ఒకలా ఉన్నాయని, వీటన్నింటినీ క్రోడీకరించి ఉన్నత విద్యాప్రమాణలతో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.




