Wednesday, 4 November 2026

17న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్(జనంసాక్షి) :  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా  మూడు రోజుల పాటు ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యేలా చూడాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ మేరకు వజ్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 17న జాతీయ పతాకాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ హరీశ్ అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయం 9  గంటలకు మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని అనంతరం విద్యార్థులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అదే రోజు హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న కొమురమ్ భీమ్ ఆదివాసీ భవనం, సేవాలాల్ బంజారా భవన ప్రారంభోత్సవానికి జిల్లా వ్యాప్తంగా ఎస్టీ ఉద్యోగులు,  ప్రజాప్రతినిధులు,  స్వయం సహాయక సంఘాల సభ్యులను బస్సులు, వాహనాల్లో తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఏమేరకు వచ్చాయనే వివరాలను కలెక్టర్ హరీశ్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్ర రాజధానికి జిల్లా నుంచి తరలివెళ్ళే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులలో భోజనం ఏర్పాట్లు, నీటి సౌకర్యంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పంచాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కలెక్టర్ హరీశ్ కోరారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,  బాలానగర్ డీసీపీ సందీప్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు , పోలీస్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.
Attachments area